వెరైటీ లుక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్‌

30 Jun, 2021 18:50 IST|Sakshi

బాలీవుడ్‌ పరిశ్రమలో నటీనటులు ఫ్యాషన్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. ఇక వారి వస్త్రాధరణ విషయానికొస్తే ట్రెండీ లుక్‌ కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కాస్త ముందు వరుసలోనే ఉంటాడనే చెప్పాలి. రణ్‌వీర్‌ తన లుక్‌లో పరంగా ఎప్పటికప్పుడూ కొత్త దనం ఉండేలా జగ్రత్త పడుతుంటాడు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే తాజాగా మన హీరో ఓ కొత్త లుక్‌ని ట్రై చేశాడు. ఎంతలా అంటే చూసిన వాళ్లంతా షాకయ్యేలా. 

తాజాగా ర‌ణ్‌వీర్ సింగ్ ఇప్పుడీ లేటెస్ట్ లుక్‌లో క‌నిపించి త‌న ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. ఈ లుక్‌ కోసం.. బ్లూ క‌ల‌ర్ ట్రాక్‌సూట్‌, పొడ‌వైన జుట్టు, ఓ లెద‌ర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించాడు. దీనికి తోడు మెడ‌లో భారీ సైజులోని న‌గ‌లు వేసుకున్నాడు. నా ప్రియ‌మైన అలెజాండ్రో అని ఈ ఫొటోల‌కు క్యాప్ష‌న్ పెట్టిన ర‌ణ్‌వీర్‌.. అలెజాండ్రో మిచెల్‌, గుచ్చిల‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారి నెట్టింట హల్‌ చల్‌  చేస్తోంది.

ఈ ఫోటో షేర్‌ చేసిన నిమిషాల్లోనే బాలీవుడ్ ప్ర‌ముఖులు, ఫ్యాన్స్‌ నుంచి కామెంట్లతో ర‌ణ్‌వీర్ నయా లుక్‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆలియా భ‌ట్ ఆశ్చర్య పోగా, హిస్టారిక్ అంటూ హిమేష్ రేష‌మియా అన్నాడు. అర్జున్ క‌పూర్ అయితే అత‌న్ని హాలీవుడ్ న‌టుడు జేరెడ్ లీటోతో పోలుస్తూ వీర్ లీటో అని కామెంట్ చేయ‌డం విశేషం. ఇక అభిమానులైతే త‌మ‌కు మ‌రో మీమ్ పండుగ వ‌చ్చింద‌ని కామెంట్లు పోస్ట్ చేశారు. 

A post shared by Ranveer Singh (@ranveersingh)

A post shared by Ranveer Singh (@ranveersingh)

చదవండి: Mandira Bedi: గుండె బద్దలైంది...సారీ మందిరా!

మరిన్ని వార్తలు