Raqesh Bapat: పక్కనోడి లైఫ్‌ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్‌ కౌంటర్‌

9 Jul, 2022 16:16 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ షోలో లవ్‌ జర్నీ మొదలుపెట్టారు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి- రాకేశ్‌ బాపత్‌. ఈ ప్రేమజంటను చూసి ముచ్చటపడిపోయారు ఫ్యాన్స్‌. షో ముగిసిన తర్వాత కూడా తరచూ కలిసి పార్టీలకు, డిన్నర్‌లకు వెళ్లేవారు. అయితే వీరి ప్రేమను చూసి ఎవరికి కన్ను కుట్టిందో, ఏమో కానీ, కొన్నాళ్లకే వీరు విడిపోయారు. ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించలేదు గానీ పలు సందర్భాల్లో పరోక్షంగా విడిపోయామని సమాధానమిచ్చారు. అయితే ఈ బ్రేకప్‌కు రాకేశ్‌ కారణమని పలువురు అతడిని తిట్టిపోశారు. తాజాగా తనను ట్రోల్‌ చేసినవారి నోరు మూయించాడీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అప్‌లోడ్‌ చేసిన ఆయన ఓ పెద్ద నోట్‌ వదిలాడు.

'ఎవరు డేటింగ్‌ చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ఎవరి కుటుంబం ఉన్నతమైనది, లేదంటే ఎవరి ఫ్యామిలీ చెత్తగా ఉంది? ఎవరికోసం ఎవరు నిలబడుతున్నారు? అన్న విషయాలను పక్కన పెట్టి.. నా లక్ష్యం ఏంటి? నేను సమాజానికి ఏమివ్వాలి? నా కుటుంబానికి నేనేం చేయగలను, జనాలు ఎలా సాయపడాలి? నా దగ్గరున్న డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? ఇంకా నేను ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి? నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవాలి? వంటి అంశాలపైన ఫోకస్‌ చేయండి. ఇదేమీ అంత కష్టం కాదు. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే తప్పకుండా దీన్ని అనుసరించేందుకు ఇష్టపడతారు' అని రాసుకొచ్చాడు రాకేశ్‌.

పక్కనోడి జీవితం గురించి ఆలోచించడం మానేసి ముందు నీకోసం నువ్వు ఆలోచించుకోమని గట్టిగానే చెప్పాడీ నటుడు. ఇకపోతే కొన్ని వారాల క్రితం షమిత శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మంచి బంధం కూడా ముగిసిపోయింది అంటూ వీరి బ్రేకప్‌ గురించి హింట్‌ ఇచ్చింది. మొత్తానికి కలిసి ఉంటారనుకున్న ఈ జంట విడివిడిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి అభిమానులు. ఇదిలా ఉంటే రాకేశ్‌ ఈ మధ్యే సర్‌సేనాపతి హంబిరావు అనే మరాఠీ సినిమాతో అలరించాడు.

A post shared by Raqesh Bapat (@raqeshbapat)

చదవండి: ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?.. డైరెక్టర్‌ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా'

మరిన్ని వార్తలు