ఎక్కువ కాలం హీరోయిన్‌గా ఉండాలంటే సమంతలా రాణించాల్సిందే

22 Jun, 2021 07:02 IST|Sakshi

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కాస్త పురు షాధిక్యం ఉన్నప్పటికీ ఇప్పటి హీరోయిన్లు కొత్త పాత్రలు, సినిమాలు చేస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుని తమ ప్రతిభను చాటుకుంటున్నారు’’ అంటున్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా. ఇంకా తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ – ‘‘ఊహలు గుసగుసలాడే’ (2014) సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో నా కెరీర్‌ ప్రారంభమైంది. ఈ చిత్రంతో నన్నొక మంచి నటిగా ప్రేక్షకులు గుర్తించారు. కానీ ఆ తర్వాత నేను దాదాపు కమర్షియల్‌ సినిమాలే చేశాను"

"మళ్లీ ‘తొలిప్రేమ’ (2017) సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో నన్ను మంచి నటిగా ప్రేక్షకులు మరోసారి చెప్పుకున్నారు. నాకు యాక్టింగ్‌ వచ్చని నమ్మారు. పరిశ్రమలో ఎక్కువ కాలం హీరోయిన్‌గా ఉండాలంటే అనుష్కా శెట్టి, సమంతల మాదిరి రాణించాల్సిందే. హీరోయిన్లంటే పాటలకే పరిమితం అనే కొందరి ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చింది వీరే’’ అని అన్నారు రాశీ ఖన్నా.

చదవండి: Rashi Khanna: హీరోయిన్‌ చేతిలో రెండు వెబ్‌ సిరీస్‌లు!

మరిన్ని వార్తలు