మనాలీలో.. యాక్షన్‌

13 Sep, 2022 03:44 IST|Sakshi
రాశీ ఖన్నా 

‘యోధ’ కోసం మనాలీ వెళ్లారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా ద్వయం తెరకెక్కిస్తున్న సినిమా ‘యోధ’. ఈ యాక్షన్  ఫిల్మ్‌లో దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. అయితే కొంత ప్యాచ్‌వర్క్‌ కోసం మనాలీ వెళ్లింది ‘యోధ’ చిత్రబృందం.

షూట్‌లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్ స్టా ద్వారా తెలిపారు రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా కొన్ని యాక్షన్ సీన్ కూడా చేశారన్నది బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కాకుండా తమిళంలో కార్తీ ‘సర్దార్‌’, తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. 

మరిన్ని వార్తలు