డిజప్పాయింట్ అయిన రష్మిక.. ఎందుకిలా?

10 Apr, 2021 16:20 IST|Sakshi

తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారిన అతికొద్ది మందిలో రష్మిక మందన్నా ఒకరు. ఛలో సినిమాలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట‍్లతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు కొట్టిన్నర వరకూ పారితోషికం తీసుకునే రేంజ్‌కి వెళ్లింది ఈ కన్నడ బ్యూటీ. టాలీవుడ్‌లో రష్మికకు ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని ఈమె నటించిన కన్నడ చిత్రాలు కూడా ఇక్కడ డబ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘పొగరు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్లాప్‌ అయినప్పటికీ రష్మిక ఇమేజ్‌ వల్ల మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.

ఇక ఇటీవల రష్మిక నుంచి వచ్చిన మరో డబ్బింగ్‌ చిత్రం ‘సుల్తాన్‌’. తమిళంలో రష్మికకు తొలి చిత్రం ఇది. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌ అయింది. దీంతో రష్మిక డిజప్పాయింట్‌ అయింది. కోలీవుడ్‌లోకి కూడా స్టార్‌ హీరోయిన్‌గా రానిద్దామకున్న ఆమె కలలు ఆవిరైపోయింది. సుల్తాన్‌ కచ్చితంగా హిట్‌ అవుంది. ఇక కోలీవుడ్‌లో బోలెడు ఆఫర్లు వస్తాయని రష్మిక ఆశపడింది.

అంతేకాదు సుల్తాన్‌ మూవీ షూటింగ్‌లో ఉండగానే విజయ్‌ సినిమాలో కూడా ఆఫర్‌ వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆ చాన్స్‌ని పూజా హెగ్డే కొట్టేసింది. అయినా రష్మిక పెద్దగా ఫీలవలేదు. సుల్తాన్‌ హిట్‌ అయితే అవకాశాలు అవే వస్తాయని భావించింది. కానీ  సుల్తాన్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో రష్మిక తెగ ఫీలవుతుందట. మరో మంచి కథను ఎంచుకొని  కోలీవుడ్‌లో హిట్‌ కొట్టాలని భావిస్తుందట.  ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’ సినిమా చేస్తుంది. అక్కడ ఆమెకు ఇదే తొలి సిసిమా. మరి బాలీవుడ్‌లో రష్మిక డెబ్యూ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు