మరోసారి సౌత్‌ మోస్ట్‌ డిసైరబుల్‌ ఉమెన్‌గా రష్మిక

2 Jun, 2021 20:04 IST|Sakshi

రష్మిక మందన్నా మరోసారి మోస్ట్‌ డిసైరబుల్‌ ఉమెన్‌గా నిలిచింది. 2014లో టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ నేషనల్‌ విన్నర్‌గా నిలిచిన రష్మిక తాజాగా బెంగళూరు టైమ్స్‌ మోస్ట్‌ డిసైరబుల్‌ ఉమెన్‌ 2020గా పేరు తెచ్చుకుంది. బెంగళూరు టైమ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో రష్మిక మొదటి స్థానంలో నిలిచినట్లు ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో  ఆమె రెండుసార్లు మోస్ట్‌ డిసైరబుల్‌ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్నట్లు బెంగళూరు టైమ్స్‌ బుధవారం ప్రకటించింది.

కాగా తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో గుగూల్‌ నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కిరిక్‌ పార్టీ  అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో నటించిన ఆమె చిత్రాలు ఛలో, గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకేవ్వరు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలకు సంతకం చేసింది. బిగ్‌బీ అమితాబచ్చన్‌తో ఆమె నటిస్తున్న గుడ్‌బై చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. దీనితో పాటు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా చిత్ర పుష్పలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు