ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక మందన్నా!

7 Jan, 2023 18:07 IST|Sakshi

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా జంటగా నటించిన 'మిషన్ మజ్ను'.  పీరియాడిక్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వనుంది. శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 20న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే  టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపైనే రష్మిక అన్ని ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా సక్సెస్‌ అయితే హిందీలో వరుస ఛాన్సులు దక్కించుకోనుంది. మరి మిషన్ మజ్నుతో  నేషనల్‌ క్రష్‌ బీటౌన్‌ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

మరిన్ని వార్తలు