Rashmika Mandanna: చిన్నారిని పట్టించుకోని రష్మిక.. 'నీ సినిమాలు చూసేదేలే' అని కామెంట్లు

25 Jan, 2022 19:49 IST|Sakshi

Rashmika Mandanna 'Breaks Hearts', Brutally Trolled: సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. 'ఛలో' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసి 'గీత గోవిందం'తో క్రేజీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. తన క్యూట్ ఎక్స్​ప్రెషన్స్​తో 2019 సంవత్సరంలో 'ఇండియన్​ నేషనల్​ క్రష్'​గా అరుదైన గుర్తింపును కూడా పొందింది. ఇటీవల విడుదలైన ఐకానిక్​ స్టార్ సరసన నటించిన 'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా బాలీవుడ్​లోనూ ఫ్యాన్స్​ను సంపాదించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఫిట్​నెస్​ వీడియోలు, క్యూట్​ ఎక్స్​ప్రెషన్​ ఫొటోస్​ షేర్​ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్​గా ఉంటుంది ఈ అమ్మడు. 

అయితే ఈ కన్నడ సుందరి తాను చేసే పనులతో ట్రోలింగ్​ బారిన పడుతోంది. ఇటీవల ముంబై ఎయిర్​పోర్టులో రష్మిక డ్రెస్సింగ్​ స్టైల్​పై నెటిజన్స్​ ఓ ఆట ఆడేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఓ సినిమా షూటింగ్​ కోసం వెళ్లిన రష్మిక మళ్లీ ట్రోలింగ్​ బారిన పడింది. ముంబైలో ఓ హోటల్​ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డులు పక్కకు తోయడం వంటివి చేసిన ఆ పాప రష్మిక వద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. అది చూసి 'తన వద్ద డబ్బులు లేవు' అని చెప్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. వేరే ఎవరితో కూడా సాయం అందించడం వంటిది చేయలేదు. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రష్మికను ఏకిపారేస్తున్నారు. 'చిన్న పాప అలా నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది' అని ప్రశ్నిస్తున్నారు. 'అసలేంటీ నీ యాటిట్యూడ్'​ అని విరుచుకుపడుతున్నారు. 'ఈరోజు నుంచి నీ సినిమాలు చూడం' అని కామెంట్స్​ పెడుతున్నారు. 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

మరిన్ని వార్తలు