రష్మిక రేంజ్‌ పెరిగిపోయింది!

7 Jan, 2021 14:53 IST|Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారారు రష్మిక మందన్నా. వరుస ఆఫర్లతో హిట్ల మీద హిట్లు కొడుతున్న ఈ అమ్మడు తాజాగా రేంజ్‌ రోవర్‌ కారు కొన్నారు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయారు. 'సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎవరితోనూ పెద్దగా పంచుకోను. కానీ ఈ సారి మాత్రం చెప్పకుండా ఉండబట్టలేకపోతున్నా. ఎందుకంటే నా ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యులే. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఇంకా నేను ఎయిర్‌పోర్టుకు పరుగెత్తుతున్న సమయంలో ఓ రెండు నిమిషాలు ఆగి మరీ కారు దగ్గర ఫొటోలు దిగాను. మనం ఎంతదూరం వచ్చామో మీకు చూపించాలి కదా! నా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అంటూ కారు ముందు నిలబడి స్టిల్స్‌ ఇచ్చిన ఫొటోను షేర్‌ చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేంజ్‌ ఓవర్‌ కారుతో రష్మిక రేంజ్‌ పెరిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారు విలువ ఎంత ఉంటుందనుకుంటున్నారు? రూ. కోటి రూపాయల పైనే! (చదవండి: మరో ‘మెగా’ చాన్స్‌ కొట్టేసిన రష్మిక!)

ప్రస్తుతం రష్మిక సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఆడాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో శర్వానంద్‌తో జోడీ కడుతున్నారు. 'మిస్టర్‌ మజ్ను'తో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. 'డాడీ' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె అమితాబ్‌ కూతురిగా కనిపించనున్నారట. ఈ సినిమాకు వికాస్‌ బాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్‌ హీరో)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు