‘పుష్ప’ లో నా పాత్ర అలా ఉంటుంది: రష్మిక

17 Jun, 2021 14:30 IST|Sakshi

పరిశ్రమలోకి వచ్చిన తక్కవ కాలంలోనే దక్షిణాది స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక మందన్నా.  వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తా చాటుతోంది. ఇక్కడ ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ రష్మిక బాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో తన తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకూమర్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్లున్‌ హీరోగా రూపొందుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీని సుక్కు రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాడు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ‘పుష్ప’లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ‘పుష్ప నా పాత్ర చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి ఇందులో నేను కనిపిస్తాను. దానివల్ల ప్రేక్షకులు నా పాత్రకు వెంటనే కనెక్ట్‌ అవుతారు. ఇంత వరకూ నేను చేయని పాత్ర ఇది. ఈ సినిమా రెండు భాగాల్లో కూడా నేను కనిపిస్తాను. ఇది నాకు మరింత సంతోషాన్నిచ్చే విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు