Rashmika Mandanna: పుష్ప-2లో రష్మిక చనిపోతుందా? అందుకే సెకండ్‌ హీరోయిన్‌ను తీసుకున్నారా?

20 May, 2023 10:40 IST|Sakshi

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 షూటింగ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా లీకులు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. చదవండి: సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్‌ హీరోకు క్రేజీ ఆఫర్‌

తాజాగా పుష్ప-2లో రష్మిక చనిపోయిందంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీనికి సంబంధించిన రష్మిక ఉన్నట్లు ఓ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో రష్మికను చంపేస్తున్నారా? అందుకే సెకండ్‌ హీరోయిన్‌ను తీసుకుంటున్నారా అంటూ ఎవరికి వాళ్లే కథలు అల్లేస్తున్నారు.

అయితే నిజానికి ఆ ఫోటో పుష్ప-2లోది కాదు. ఓ మరాఠీ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్‌ అది. అంతేకాదు, అక్కడ కనిపించిన హీరోయిన్‌ కూడా రష్మిక కాదు. ఆమె పేరు ఈషా దివేకర్‌. సో పుష్ప-2లో రష్మిక చనిపోతుంది అంటూ వైరల్‌ అవుతున్న న్యూస్‌లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. దీంతో రష్మిక ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

చదవండి: Jr Ntr : జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు