నమ్మలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్‌ ట్వీట్‌

27 Oct, 2020 15:20 IST|Sakshi

రష్మిక మందన్నా.. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్‌. ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ..  ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వరుస ఆఫర్స్‌ దక్కించుకుంటోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు త్వరలోనే తమిళ తెరపై కూడా మెరవనుంది. కార్తీ హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్‌’ లో ఈ అమ్మడు నటించింది. ఇది తమిళంలో తనకు మొదటి సినిమా. సోమవారం విడుదలైన 'సుల్తాన్' ఫస్ట్‌లుక్ పోస్టర్ షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది రష్మిక.
(చదవండి : కార్తీకి జోడిగా..సుల్తాన్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్)

‘ చిన్నప్పటి నుంచి నాన్న, నేను కలిసి చాలా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేకపోతున్నా. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. ఇందుకు నేను కృతజ్ఞురాలిని’ అని రష్మిక ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెకు  ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా, . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్  బక్కియరాజ్ కన్నన్ ర‌చ‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సిన‌మా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల్లో ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు