ఆ కిక్కే వేరు రా! 

23 Oct, 2023 01:23 IST|Sakshi
‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లో రష్మిక

‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్‌ హవర్స్‌ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంటే.. ప్చ్‌.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్‌తో కూడిన వాయిస్‌ ఓవర్‌తో మొదలవుతుంది ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా మోషన్  పోస్టర్‌. హీరోయిన్  రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు.

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌ టైన్ మెంట్‌ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్‌ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్‌ చేశారు రష్మికా మందన్నా.

‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్, కెమెరా: కృష్ణన్‌ వసంత్‌.

మరిన్ని వార్తలు