Rashmika Mandanna: ఆ చిత్రం పైనే భారీ ఆశలు పెట్టుకున్న నేషనల్ క్రష్!!

22 Sep, 2023 08:46 IST|Sakshi

పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అల్లు అర్జున్‌ సరసన  నటించిన ఈ చిత్రమే కన్నడ బ్యూటీని బాలీవుడ్‌ వరకు తీసుకెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా బాలీవుడ్‌లోనే ఈ అమ్మడు పరిస్థితి‌ ఆశించిన స్థాయిలో లేదు. హిందీలో నటించిన తొలి చిత్రం గుడ్‌ బై పూర్తిగా ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన మిషన్‌ మజ్ను కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రణ్‌బీర్‌ కపూర్ సరసన యానిమల్‌ చిత్రం ఒకటే ఉంది.

(ఇది చదవండి: పాపం గౌతమ్‌.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్‌ ప్లాన్‌ అదేనా?)

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, బాబిడియోల్‌ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపైనే రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ కెరీర్‌ ఈ చిత్రం రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే.. తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్‌ లేదు. ఎందుకంటే రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్‌ డిజాస్టర్‌గా మిగిలింంది. ఇకపోతే వారియర్స్‌ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. 

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

దీంతో హిందీ చిత్రం యానిమల్‌ హిట్‌ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగులో అల్లు అర్జున్‌ సరసన నటిస్తోన్న పుష్ప–2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కాగా.. టాలీవుడ్‌లో ప్రస్తుతం పుష్ప–2 తో పాటు రెయిన్‌ బో అనే లేడీ‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ కలిసి నేషనల్‌ క్రష్‌కు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏ‍ర్పడింది. 

మరిన్ని వార్తలు