బాలీవుడ్‌లో కొత్త మిషన్‌ను స్టార్ట్‌ చేసిన రష్మిక

6 Mar, 2021 14:02 IST|Sakshi

బాలీవుడ్‌లో కొత్త మిషన్‌ను స్టార్ట్‌ చేశారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చీ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా ‘మిషన్‌ మజ్ను’లో నటిస్తున్నారామె. 1971నాటి బ్యాక్‌డ్రాప్‌లో స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తారు సిద్ధార్థ్‌ మల్హోత్రా. తాజాగా ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమాలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. తెలుగులో అల్లు అర్జున్‌  హీరోగా నటిస్తున్న ‘పుష్ప’, శర్వానంద్‌ చేస్తున్న ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తున్నారామె. తమిళంలో రష్మిక నటించిన ‘సుల్తాన్‌ ’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు