నోరూరించే ఆమ్లెట్ వేసిక ర‌ష్మిక‌

14 Oct, 2020 20:37 IST|Sakshi

క‌రోనా సెల‌బ్రిటీల జీవితాల్లో కొన్ని వైవిధ్య‌మైన‌ మార్పులు తీసుకువ‌చ్చింది. షూటింగ్‌ల‌తో క్ష‌ణం కూడా తీరిక ఉండ‌ని వారికి బోలెడంత ఖాళీ స‌మ‌యాన్ని ఇచ్చింది. దీంతో కొంద‌రు ఇంటి ప‌నులు నేర్చుకోగా మ‌రికొంద‌రు ఎవ‌రి ప‌నులు వారే చేసుకుంటున్నారు. ఇక ఈ అవ‌కాశం మ‌ళ్లీ దొర‌క‌దంటూ చాలామంది వంటింట్లో దూరి గరిటె తిప్పారు. ఆ లిస్టులో చిరంజీవి కూడా ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌ల‌యాళ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా త‌నకిష్ట‌మైన వంట‌కాన్ని వండుతూ మ‌రీ అభిమానులకు తెలియ‌జేశారు. అంతేకాదు, ప్ర‌తిరోజు త‌న డైట్‌లో ఆమ్లెట్ ఉండాల్సిందేన‌ని, అది లేక‌పోతే ముద్ద దిగ‌దంటున్నారు. (చ‌ద‌వండి: ‘రాధే శ్యామ్‌’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌)

స్టౌ వెలిగించ‌డం ద‌గ్గ‌ర నుంచి ఆమ్లెట్ వేయ‌డం వ‌ర‌కు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చూస్తుంటేనే నోరూరించే విధంగా ఆమ్లెట్‌ను రెడీ చేశారు. "నాకు ప్ర‌తిరోజు ఆమ్లెట్ ఉండాల్సిందే. మీరు కూడా దీన్ని ఓసారి ప్ర‌య‌త్నించండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి" అని రాసుకొచ్చారు. కాగా "ఛ‌లో" సినిమాతో కెరీర్ మొద‌లు పెట్టిన ర‌ష్మిక త‌క్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుర్ర హీరోల‌తో పాటు స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో హీరో అల్లు అర్జున్‌కు జోడీగా న‌టిస్తున్నారు. (చ‌ద‌వండి: అలలు.. ఇసుక... భలే మంచి అనుభూతి)

Try it.. and let me know how you like it. 💛

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు