ఇలాంటివి ఎవరూ చేయకండి..బాధగా ఉంది : రష్మిక

28 Jun, 2021 15:52 IST|Sakshi

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. రష్మకి క్యూట్‌ లుక్స్‌కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రష్మిక నేషనల్‌ క్రష్‌గానూ మారిపోయింది. ఇటీవలె ఓ అభిమాని రష్మికను కలిసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. గూగుల్‌ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకొని మరీ ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు హీరోయిన్‌ రష్మిక ఇంటిని మాత్రం కనిపెట్టగలిగాడు. అయితే రష్మిక షూటింగ్​ కోసం ముంబై వెళ్లడంతో ఆమెను కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్‌ రష్మిక స్పందించింది.

ఓ అభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు ఇప్పడే నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు బాధగా ఉంది. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు అతన్ని కలుస్తానన్న నమ్మకం ఉంది. అంటూ రష్మిక ట్వీట్‌ చేసింది. ఇక రష్మిక ఇటీవలె ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ నేపథ్యంలో అక్కడకి షిఫ్ట్‌ అయినట్లు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప అనే పాన్‌ ఇండియా మూవీ చేస్తున్న రష్మిక బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తి కాకుండానే మరో బాలీవుడ్‌ చిత్రానికి సైన్‌ చేసింది. 

చదవండి : ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్‌ అయిన రష్మిక
చూపు కోల్పోయిన కత్తి మహేష్?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు