Rashmika Mandanna: అదరగొడుతున్న కోలకళ్ల చిన్నది సాంగ్‌

6 Jan, 2022 10:19 IST|Sakshi

యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చిత్తం మహారాణి'. ఏ కాశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'కోలకళ్ళ చిన్నది' లిరికల్ సాంగ్‌ను ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన్నా ఈ పాటను విడుదల చేయగా దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.

ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

మరిన్ని వార్తలు