అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక

16 Apr, 2021 13:02 IST|Sakshi

షాహిద్‌కపూర్‌కు నో చెప్పిన రష్మిక

రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో  'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ల కంటే ముందే ఈ అమ్మడికి బీటౌన్‌ నుంచి ఓ మంచి ఆఫర్‌ వచ్చింది. స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సరసన జెర్సీ రీమెక్‌లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్‌ పిలుపు కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు రిజెక్ట్‌ చేసిందో చెప్పుకొచ్చింది. 'జెర్సీ' మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్‌లోనూ రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

చదవండి : ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక
రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు