రష్మికకు గూగుల్‌ అరుదైన ఘనత..!

20 Nov, 2020 16:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రష్మిక మందన్నా.. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో మారుమోగుతున్న పేరు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే టాలీవుడ్‌, సౌత్‌ ఇండస్ట్రీలో వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేస్తున్నారు. ఇలా దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మికు తాజాగా గూగుల్‌ అరుదైన ఘనతను ఇచ్చింది. 2020 సంవత్సరానికి గాను రష్మిక నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా ఎన్నికైనట్లు ప్రకటించింది. 2019-20 ఏడాదిలో గూగుల్‌ ఎక్కువగా రష్మిక పేరును సెర్స్‌ చేసినట్లుగా గూగుల్‌ తన ప్రకటనలో పేర్కొంది. అయితే 2020 నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా అని సెర్చ్‌ చేయగా.. ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా రష్మిక మందన్నా అని మొదలవుతూ.. మేము ఖచ్చితంగా తను ఎంచుకునే దుస్తుల విధానాన్ని ఇష్టపడతాం.. ఆ తర్వాత తన రేడియంట్‌ మేకప్‌ను’ అనే రిజల్ట్స్‌ చూపిస్తోంది. (చదవండి: నమ్మలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్‌ ట్వీట్‌)  

అయితే ‘ఛలో’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందంతో భారీ హిట్‌కొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నితిన్‌ల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌‌తో ‘పుష్పా’లో నటిస్తున్న రష్మిక కన్నడలో ధృవసర్జా ‘పొగరు’లో నటించారు. ఇప్పుడు ‘సుల్తాన్’ చిత్రంతో తమిళంలో సైతం అడుగుపెడుతోంది. ఇలా దక్షిణాదిన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిషకకు నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా అరుదైన గుర్తింపు దక్కడంతో ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే హిందీలో ఇప్పటికి ఒక్క సినిమాలో కూడా నటించనప్పటికీ రష్మికకు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు రావడం నిజంగా విశేషమేనని నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. (చదవండి: ఒక్క సినిమాకు ర‌ష్మిక రూ.2 కోట్లు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా