Rashmika Mandanna: విజయ్‌తో రష్మిక మందన్నా సెల్ఫీ వైరల్‌

15 Sep, 2022 12:13 IST|Sakshi

తమిళసినిమా: సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు సెల్ఫీలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సెలబ్రిటీలతో సెల్ఫీ అంటే అందరికీ క్రేజీ అనే చెప్పాలి. నటి రష్మిక మందన్నా సెల్ఫీనే సామాజిక మాధ్యమాల్లో క్రేజీగా వైరల్‌ అవుతోంది. ఈ శాండిల్‌వుడ్‌ బ్యూటీ టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. పుష్ప చిత్రం ఈ అమ్మడి రేంజ్‌ను బాలీవుడ్‌ వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం విజయ్‌తో వారీసు చిత్రంలో నటిస్తోంది.

తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. షూటింగ్‌ స్పాట్‌లో ఫొటోలు ఇప్పటికే లీక్‌ అయి యూనిట్‌ వర్గాలను షాక్‌కు గురి చేశాయి. తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ చిత్ర ఆడియో దీపావళికి విడుదల కానుందని తన ట్విట్టర్లో పేర్కొని వారీసు చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈ చిత్రం సంక్రాంతికి భారీ అంచనాల మధ్య తెరపై రానుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో నటి రష్మిక మందన్నా విజయ్‌తో సెల్ఫీ ప్లీజ్‌ అంటూ తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు