Rashmika Mandanna: అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటా

30 Jun, 2021 13:48 IST|Sakshi

రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా మారింది. కిరిక్‌పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో 'మిషన్ మజ్ను' సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాకి మాత్రం టైం కేటాయిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. అంతేకాదు సోషల్‌ మీడియాలో ఈ భామ చేసే చేష్టలు, పెట్టే వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆమెకి అభిమానులు రోజు రోజుకి పెరిగిపోతుంటారు. 

ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్‌ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్‌ గ్యాప్‌లో సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో రష్మిక తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ‘మీరు స్మోక్‌ చేస్తారా?’ అని ఓ నెటిజన్‌ అడిగితే, ‘‘నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్‌ అంటే అసహ్యం. స్మోక్‌ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’అని చెప్పింది. మరో నెటిజన్‌ ‘నన్ను పెళ్లి చేసుకోండి’అని అడగ్గా.. కనీసం ప్రపోజల్‌ అయినా మంచిగా చెయ్యొచ్చు కదా అని మూతి తిప్పుకుంది ఈ  ముద్దుగుమ్మ.

ఇక మరో నెటిజన్‌ ఒక అడుగు ముందుకేసి.. మీలాంటి  ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటని ప్రశ్నించాడు. దానికి రష్మిక సమాధానంగా..‘మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి’అని చెప్పింది. మొత్తానికి రష్మికకు ఎలాంటి వాడు కావాలో చెప్పకనే చెప్పేసింది.
చదవండి:
‘హ్యాపీడేస్‌’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

మరిన్ని వార్తలు