Pushpa 2 Movie: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !

22 Jun, 2022 20:43 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో పుష్పరాజ్‌ వైరల్‌ అయ్యాడు. డైలాగ్స్‌, సాంగ్స్‌, స్టెప్పులు..ఇలా ప్రతీదీ ట్రెండ్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’అనే డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఇందులో శ్రీవల్లిగా నెషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అదరగొట్టింది. రష్మిక, బన్నీల మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ అయింది. కాగా 'పుష్ప'కు సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్‌' వస్తున్న విషయం తెలిసిందే. 

మొదటి పార్ట్‌లో అలరించిన శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్‌లో చనిపోతుందన్న వార్తలు గత కొద్దిరోజులుగా తెగ షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై నిర్మాత వై. రవి శంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'అదంతా చెత్త. నాన్సెన్స్‌. నిజానికి పుష్ప 2 కథేంటో మాకే సరిగ్గా తెలియదు. అవన్నీ వట్టి ఊహాగానాలు మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఒక్కో సమయంలో పలు వెబ్‌సైట్‌లు, టీవీ ఛానెల్స్‌ సినిమాలపై ఇలానే రాస్తాయి. కానీ వాటి గురించి వారికి ఏం తెలియదు. కాబట్టి దాన్ని నమ్ముతారు' అని వై రవి శంకర్‌ పేర్కొన్నారు. కాగా పుష్ప 2 సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆలాగే డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లు అని సమాచారం. 

చదవండి: కమెడియన్‌ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
శరద్‌ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్‌..

మరిన్ని వార్తలు