సూర్యతో రష్మిక?

23 Nov, 2020 00:23 IST|Sakshi
సూర్య, రష్మిక మందన్నా

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు రష్మిక మందన్నా. మాతృభాష కన్నడలోనూ సత్తా చాటుతున్నారీ బ్యూటీ. తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉన్నా కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారామె. కార్తీ హీరోగా బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్‌’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు రష్మిక. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కోలీవుడ్‌లో మొదటి సినిమా విడుదలవక ముందే రష్మికని మరో క్రేజీ ఆఫర్‌ వరించిందని టాక్‌.

కార్తీ సోదరుడు, హీరో సూర్య సరసన ఓ సినిమాలో నటించే అవకాశం అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కథానాయిక చాన్స్‌ రష్మికని వరించిందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో హిట్‌ కొట్టిన సూర్య తర్వాతి సినిమాల్ని త్వరగా పూర్తి చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధం అవుతున్నారట. కాగా రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలోనూ, కన్నడలో ‘పొగరు’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు