Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్‌’ రష్మిక హావా.. కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌!

19 Jul, 2022 09:01 IST|Sakshi

కన్నడ బ్యూటీ రష్మిక హవా తగ్గేదేలే అన్నట్లుగా సాగుతోంది. టాలీవుడ్‌ ఈ అమ్మడికి స్టార్‌ డమ్‌ను తీసుకొస్తే దాన్ని కోలీవుడ్, బాలీవుడ్‌లు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. పుష్ప చిత్రంతో తెలుగుతో పాటు, తమిళం, హిందీ ప్రేక్షకుల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్న రష్మిక క్రేజ్‌ పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో విజయ్‌ నటిస్తున్న వారీసు చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో పుష్ప- 2లోనూ నటించనుంది. ఇక హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మికకు తాజాగా కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

నటుడు విక్రమ్‌తో జతకట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీన్ని స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌ రాజా నీలం ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. జయ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయకగా నటి రష్మికను సంప్రదించి చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రష్మిక కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వినికి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని చిత్రవర్గాల నుంచి సమాచారం.

చదవండి: మహేశ్‌ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్‌ రాజ్‌

మరిన్ని వార్తలు