పొలం దున్నుతున్న రష్మిక.. వీడియో వైరల్‌

18 Mar, 2021 13:01 IST|Sakshi

రష్మిక మందన్నా.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అతికొద్ది మందిలో ఒకరు. ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట‍్లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ సినిమాలో వరుస ఆఫర్స్‌ దక్కించుకుంటుంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు, హిందీ, తమిళ తెరపై కూడా సందడి చేయనుంది. 

 త‌మిళంలో కార్తీ హీరోగా రూపొందుతున్న ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని రష్మిక తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది.

ఇందులో రష్మిక పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. దుక్కిదున్నే యంత్రంతో రష్మిక బురదలోకి, రైతు మాదిరి పొలం దున్నుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 2న ‘సుల్తాన్’‌ థియేటర్లోకి రానుంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసనగ ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.

చదవండి: 
అందుకే సౌందర్య ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు : ఆమని
జీన్స్‌ వద్దన్న సీఎం! బరాబర్‌ వేస్తానంటున్న బిగ్‌బీ మనవరాలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు