Rashmika -Vijay: విజయ్- రష్మిక అంటే మామూలుగా ఉండదు మరీ..!

28 Sep, 2023 16:19 IST|Sakshi

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్‌ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ కలిసి నటించారు. దీంతో వీరిద్దరు టాలీవుడ్‌లో ఫేవరేట్‌ జోడీగా నిలిచారు. ఇండస్ట్రీలో విజయ్, రష్మిక గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు)

ప్రస్తుతం రష్మిక, రణ్‌బీర్‌ కపూర్ జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్‌ 28న రణ్‌బీర్‌ కపూర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. యానిమల్ టీజర్‌ రిలీజ్ చేస్తూ మేకర్స్ ట్వీట్‌ చేశారు. అయితే దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రణ్‌బీర్‌ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. విష్‌ యూ మై డార్లింగ్స్ అంటూ పోస్ట్ చేశారు.

విజయ్ ట్వీట్‌కు రష్మిక మందన్నా కూడా రిప్లై ఇచ్చింది. థ్యాంక్యూ.. యూ ఆర్‌ ది మై బెస్ట్.. అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు బెస్ట్ పెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా..రష్మిక, రణ్‌బీర్‌ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్‌'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?)

కాగా.. 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్‌ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కిస్తోన్న యానిమల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు