తమిళ హీరో విజయ్‌కు జోడీగా రష్మిక!

7 Feb, 2021 13:10 IST|Sakshi

కోలీవుడ్‌లో ఓ బంపర్‌ ఆఫర్‌ను దక్కించుకున్నారట రష్మికా మందన్నా. తమిళ ‘డాక్టర్‌’ సినిమా ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో మాస్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రష్మికా మందన్నా పేరు బలంగా వినిపిస్తోంది. విజయ్‌కు జోడీగా రష్మికా కనిపిస్తుందా? అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ఆరంభం కానుందనే ప్రచారం జరుగుతోంది. రష్మికా మందన్నా తమిళంలో నటించిన తొలి సినిమా ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఇక  తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలతో పాటు హిందీలో ‘మిషన్‌ మజ్ను’ సినిమాలో నటిస్తున్నారు రష్మికా మందన్నా.

చదవండి: ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమాలకు బ్రేక్‌ చెప్పిన రామ్‌!

చదవండి: ర‌ష్మిక మంద‌న్న‌కు షాకిచ్చిన ఆ హిరోయిన్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు