మాస్‌ హీరోల దాడి.. పట్టించుకోండి అని వేడుకుంటున్న స్టార్‌ హీరోయిన్స్‌!

25 Feb, 2023 16:15 IST|Sakshi

ఇటీవలకాలంలో హీరోయిన్స్ ...హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతే కాదు హీరోలతో  పాటు సమానంగా స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ట్రెండ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో హీరో సెంట్రిక్ సినిమాల హవా మొదలయింది.  మాస్ హీరోల సినిమాల దాటికి వుమెన్ సెంట్రిక్ సినిమాలకి అనుకున్న రేంజ్ లో హైప్ రావటం లేదు.. దీంతో స్టార్‌ హీరోయిన్స్ సైతం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. 

హీరోల ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ తో స్క్రీన్ నిండిపోవటంతో.. హీరోయిన్స్ పాటలకి..రెండు సీన్స్ కి పరిమితం అయిపోతున్నారు. గతంలో కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్మూలా ఉండేది..ఆరు పాటలు...ఆరు ఫైట్స్...మధ్య లో హీరోయిన్ తో రెండు మూడు సీన్స్ ... ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో...హీరోయిన్స్  స్క్రీన్ స్పెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. 

సంక్రాంతి కి రిలీజైన కమర్షియల్ మూవీస్ చూస్తే...ఈ విషయం క్లారిటీగా అర్ధమైపోతుంది. వాల్తేరు వీరయ్య...వీర సింహారెడ్డి..వారసుడు సినిమాల్లో హీరోయిన్స్ నామా మాత్రంగానే కనిపించారు. వాళ్ల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసినా..పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కించుకోలేకపోయింది. ఇక వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్  పాటలకే పరిమితం అని చెప్పాలి. వారసుడులో నటించిన రష్మిక మందన్న పరిస్థితి కూడా అలానే అయింది. 

 పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపిన సినిమాలు కెజిఎఫ్‌ చాపర్ట్ వన్..కెజిఎఫ్‌ ఛాప్టర్ 2.. ఈరెండు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కానీ స్క్రీన్ స్పెస్ తక్కువనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలతో బజ్ క్రియేట్ చేయలేకపోతున్న హీరోయిన్స్ కి...  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలిసి రావటం లేదు.  ఈ మధ్య యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత..అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సమంత పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించినా..ఆ తర్వాత ఎక్కడా సమంత పేరు వినబడలేదు. 

ఇక కమర్షియల్ సినిమాలనే నమ్ముకున్న కీర్తి సురేష్‌, రష్మిక మందన్న, పూజా హెగ్డే... లాంటి హీరోయిన్ల పేర్లు సినిమా ఎనౌన్స్మెంట్ ...మూవీ ఓపెనింగ్స్ లో తప్ప ఎక్కడ వినిపించటం లేదు. ఇక సినిమాలు సక్సెస్ అయితే హీరో దర్శకులు గురించి మాట్లాడుతున్నారు తప్ప... హీరోయిన్స్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు.  హీరో సెంట్రిక్ సినిమాలకు క్రేజ్  రావటంతో...ఈ అందాల భామలను ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. సో..మొత్తానికి కమర్షియల్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై నల్లపూసల్లా మారిపోయిన హీరోయిన్స్ క్రేజ్ తగ్గిందనే మాట ..ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది.

మరిన్ని వార్తలు