డియరెస్ట్‌ కరోనా అంటున్న బుల్లి రష్మిక.. ఫోటో వైరల్‌

21 May, 2021 13:17 IST|Sakshi

రష్మిక మందన్న.. ఛలో సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన  ఈ కన్నడి భామ.. ‘గీత గోవిందం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మూవీ సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రెడ్' లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లో మహేశ్‌బాబుకి జోడిగా నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలా కెరీర్‌ పరంగా వేగంగా దూసుకెళ్తున్న ఈ భామ.. సోషల్‌ మీడియాలోనూ అంతే వేగంగా దూసుకెళ్తుంది. 

సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..  ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్‌డేట్స్‌ని కూడా అభిమానులతో పంచుకుంటుంది. చాలా అంశాలపై ఫన్నీగా స్పందిస్తుంటుంది. ఇక కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. సోషల్‌ మీడియాలో రష్మిక అల్లరి మరింత ఎక్కువైంది.

ఫన్నీ వీడియోలు, హాట్‌ ఫోటోలతో నెటిజన్లుకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తోంది. ఇక తాజాగా ఈ కన్నడ భామ ఓ అరుదైన ఫోటోని షేర్‌ చేస్తూ కరోనాపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన చిన్న నాటి ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ప్రియమైన కరోనా నువ్ ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్తావో అని ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

మరిన్ని వార్తలు