జీవితంలో అది తల్చుకోకుండా వంట చేయ‌ను

26 Aug, 2020 14:25 IST|Sakshi

ర‌సొడే మే కౌన్ థా? (వంట‌గ‌దిలో ఉన్న‌ది ఎవ‌రు?) అనే ర్యాప్ సాంగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో అంత స్పెష‌ల్ ఏముంది అనుకునేరు? మ‌రేం లేదు.. సాథ్ నిభానా సాథియా(కోడ‌లా కోడ‌లా కొడుకు పెళ్లామా) సీరియ‌ల్‌లో అత్త క్యారెక్ట‌ర్ కోకిలాబెన్ వంట‌గ‌దిలో పొయ్యి మీద ఖాళీ కుక్క‌ర్ పెట్టి ఉంది. అది చేసింది ఎవ‌రు అంటూ అంటూ గోపిని ప్ర‌శ్నిస్తూ కోడ‌లికి చీవాట్లు పెడుతుంది. అందుకు ఆమె ఏడుస్తూ వంట‌గ‌దిలో ఉంది రాశి అని చెప్తుంది. ఈ స‌న్నివేశాన్ని క్యాచ్ చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు య‌శ్‌రాజ్ ముఖ‌టే. ఆ డైలాగ్‌ల‌కు మ్యూజిక్‌ జోడించి వదిలాడు. అంతే.. అది కాస్తా నెటిజ‌న్ల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. (చ‌ద‌వండి: లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని’)

అటు ఆ స‌న్నివేశం, ఇటు ఈ ర్యాప్ సాంగ్ రెండింటినీ క‌లిపి మీమ్స్ రాయుళ్లు ఫ‌న్నీ మీమ్స్ సృష్టిస్తూ నెటిజ‌న్ల‌కు న‌వ్వులు పంచుతున్నారు. కోకిలా బెన్‌లా న‌టించిన రూప‌ల్ ప‌టేల్ ద‌త్తా.. పాట బాగుంద‌ని య‌శ్‌రాజ్‌కు ఫోన్ చేసి మ‌రీ మెచ్చుకున్నారు. అలాగే సీరియ‌ల్‌లో రాశిగా క‌నిపించిన రుచ హ‌స‌బ్నీస్‌ కూడా త‌న‌కీ ర్యాప్ సాంగ్‌ తెగ న‌చ్చిందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ పాట‌పై స్టార్ చెఫ్‌ వికాస్ ఖ‌న్నా స్పందించారు. "దీని గురించి ఆలోచించ‌కుండా నా జీవితంలో కుక్క‌ర్‌లో శ‌న‌గ‌ల కూర‌‌ చేయ‌ను కాబోలు" అని ట్విట‌ర్‌లో రాసుకొచ్చారు. మ‌రోవైపు ఈ ఒక్క వీడియోతో య‌శ్‌రాజ్ ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఫాలోవ‌ర్లు కూడా భారీగానే పెరిగారు. (చ‌ద‌వండి: సర్జరీ చేశారు.. ఇంటికి వచ్చేశా: నటుడు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు