Rathika Remuneration For BB7: బయటకెళ్లిపోతేనేం.. 'బిగ్‌బాస్'తో బాగానే సంపాదించింది!

1 Oct, 2023 23:24 IST|Sakshi

బిగ్‌బాస్ 7 సీజన్ చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే వస్తున్న క్రమంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీన్నిబట్టి హౌస్‌లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. 

ఊహించని ట్విస్ట్
అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్నీ తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్న రతిక.. ఈ విషయంలో సక్సెస్ అయింది. కానీ గేమ్స్‌, టాస్కుల విషయానికి వచ్చేసరికి తేలిపోయింది. ఎందులోనూ విజయం సాధించలేకపోయింది. ఇక రెండో వారం రతిక.. సొంత టీమ్ సభ్యులనే బఫూన్స్ అనడం చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్‌' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?)

లవ్ ట్రాక్స్ నో వర్కౌట్
ఇక బిగ్‌బాస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌తో క్లోజ్ అయింది. వీళ్లిద్దరూ ప్రేమ పక్షులు అనే రేంజులో రెచ్చిపోయారు. తీరా రెండో వారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. యవర్‌తో ప్రేమ లాంటి వ్యవహారం కూడా బెడిసికొట్టింది. ప్రశాంత్, యవర్‌తో క్లోజ్‌గా ఉంటూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. ఇది ఆమెకు గేమ్ ప్లాన్‌లా అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆమెని ఎలిమినేట్ చేసేశారు.

రెమ్యునరేషన్ గట్టిగానే
నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక.. ప్రతివారం రూ.2 లక్షలు చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి రూ.8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం. దీన్నిబట్టి చూసుకుంటే నెల రోజులు హౌసులో ఉండి, ఇంత మొత్తం కూడబెట్టుకుంది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇంత త్వరగా ఎలిమినేట్ అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే అందుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

మరిన్ని వార్తలు