నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’

4 Sep, 2022 01:07 IST|Sakshi
సింహా, సందీప్, సత్యదేవ్‌

సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్‌ దర్శకత్వంలో అరుణ్‌ కుమార్‌ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్‌కి యాక్టర్‌ సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సింహా తనయుడు అర్జున్‌ సింహా క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్‌ అయ్యానో, థియేటర్స్‌లో ఆడియన్స్‌ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్‌ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్‌ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్‌ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్‌ సంగీతం, మనోహర్‌ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్‌.

మరిన్ని వార్తలు