అన్ని రకాల పాత్రలు చేయాలనుంది

21 Mar, 2023 09:31 IST|Sakshi

‘‘నా ప్రతి సినిమాలో ఎప్పుడూ కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాను. నా గత చిత్రాలు ‘హోరాహోరి, హుషారు, జాంబిరెడ్డి’ కూడా వేటికవే ప్రత్యేకమైన జోనర్‌. ‘రావణాసుర’ కూడా చాలా వైవిధ్యమైన సినిమా. ఇందులో నా పాత్ర చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారు’’ అని హీరోయిన్‌ దక్షా నగార్కర్‌ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించిన దక్షా నగార్కర్‌ మాట్లాడుతూ..‘‘రావణాసుర’ కోసం అభిషేక్‌గారు నన్ను సంప్రదించారు. ఆ తర్వాత సుధీర్‌ వర్మగారు నా పాత్ర, లుక్‌ గురించి చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నా పాత్రకి ఎంత న్యాయం చేయగలను అనే దానిపైనే దృష్టి పెట్టాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర చేశాను. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని, అందరి హీరోలతో కలిసి నటించాలని ఉంది. కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకున్నాను’’ అన్నారు.   

మరిన్ని వార్తలు