సిగ్గులేని రాజకీయాలు ఆర్యన్‌ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి: నటి

9 Oct, 2021 09:12 IST|Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు. ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో ఈ స్టార్‌కిడ్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో బెయిల్‌ పిటిషన్‌ని కోర్టు కొట్టివేయగా.. వారిని ఆర్థర్‌ రోడ్‌ జైలుకి తరలించారు. 

అయితే చాలామంది నటులలాగే సినీయర్‌ నటి రవీనా టండన్‌ సైతం ఈ స్టార్‌కిడ్‌కి మద్దతుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. అందులో.. సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని నటి తెలిపింది.

అయితే ఆర్యన్‌ను ఈ కేసులో కావాలనే ఇరికించారని బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వేరే ఏదో కేసును పక్కదోవ పట్టించాడనికి ఇలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆర్యన్‌కు మరోసారి బెయిల్‌ నిరాకరణ, ఆర్థర్ రోడ్ జైలుకి..

మరిన్ని వార్తలు