నకిలీ ట్విటర్ ఖాతా, బాలీవుడ్ నటి ఫిర్యాదు

31 Oct, 2020 18:57 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి రవీనా టాండన్ నకిలీ  సోషల్ మీడియా ఖాతా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ప్రొఫైల్‌ను సృష్టించిన సైబర్ నేరగాడు, ముంబై పోలీసులను,  పోలీస్ బాస్ ను అపఖ్యాతి పాలు చేశారని అరోపిస్తూ ఆమె ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దీంతో సదరు ట్విటర్ ఖాతాను అధికారికంగా బ్లాక్ చేశారు. 

ముంబై పోలీసులను, ఉన్నతాధికారి పరంవీర్ సింగ్‌ను అపఖ్యాతిపాలు చేసేలా, మార్ఫింగ్ చిత్రాలతో రవీనా ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది.  దీంతో అప్రత్తమైన నటి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసుల సైబర్ సెల్ చర్యలకు దిగింది. ఈ సందర్భంగాపోలీసు‌ అధికారి మాట్లాడుతూ నిందితుడు  రవీనా పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాతో ముంబై పోలీస్ చీఫ్ సింగ్ పై ఒక వీడియోను సృష్టించి,  అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేశాడని తెలిపారు. అలాగే ఆమె ట్విట్టర్ పోస్టుల ద్వారా మరాఠీ భాషను, మరాఠీ మాట్లాడేవారిని కించపరిచాడని పేర్కొన్నారు.  సమాచార సాంకేతిక చట్టం  ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు