Shilpa Shetty: భర్త అరెస్ట్‌తో శిల్పాకు అవమానాలు, నిందలు

1 Aug, 2021 13:24 IST|Sakshi

Shilpa Shetty: హీరోయిన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా తీరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ మొదలు ఇప్పటిదాకా రాజ్‌కుంద్రా చేసిన పనుల వల్ల పరోక్షంగా శిల్పాశెట్టినే ఎక్కువ నిందలు భరించింది. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్‌ కావడం శిల్పాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటిదాకా తలెత్తిన ఆటుపోట్లు ఒకటైతే, కుంద్రా అరెస్ట్‌ అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓవైపు కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుండగానే, పలువురు హీరోయిన్లు సహా సొంత ఉద్యోగులే రాజ్‌కుంద్రాపై లైంగిక ఆరోపణలు చేస్తుండటం శిల్పాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. 


రాజ్‌కుంద్రా వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా ప్రస్తుతం జడ్జిగా ఉన్న సూపర్‌ డ్యాన్సర్‌ రియాలిటీ షో నుంచి  తాత్కాలికంగా వైదొలిగింది. గత మూడు సీజన్స్‌లోనూ జడ్జిగా ఉన్న శిల్పా ప్రెసెన్స్‌ షోకు మరింత కలిసొచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షో పాపులర్‌ అయ్యేందుకు శిల్పా కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె తిరిగి జడ్జిగా వ్యవహరిస్తారా లేదా అన్నది సందేహమే. దీంతో శిల్పా స్థానంలో జడ్జిగా ఉండాలంటూ హీరోయిన్‌ రవీనా టాండన్‌ని షో ప్రతినిధులు సంప్రదించారని సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన రవీనా.. శిల్పాశెట్టిలా  మరొకరు చేసుకోలేరని అభిప్రాయపడిందట. అందుకే శిల్పా స్థానాన్ని తాను రీప్లేస్‌ చేయలేనని చెప్పేసినట్లు బీటౌన్‌ టాక్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు