జుట్టు సమస్యకు రవీనా టండన్ చిట్కాలివే ..

17 Sep, 2020 17:55 IST|Sakshi

ముంబై: పలు భాష‌ల్లో న‌టిస్తూ అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన బాలీవుడ్‌ న‌టి ర‌వీనా టండ‌న్ తాజాగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఓ చిట్కా చెప్పింది.  ప్రస్తుత ప్రపంచంలో జుట్టు రాలడమనేది అతి పెద్ద సమస్య. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాగా రవీనా వరుసగా బ్యూటీ సిరీస్‌ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు. ప్రస్తుతం జట్టు సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కా చెప్పారు. ఎన్ని కెమికల్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని,  కొద్ది రోజుల తర్వాత జుట్టు సమస్యతో బాధపడుతుంటారని రవీనా తెలిపింది. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని పేర్కొంది.

జట్టు రాలడాన్ని నివారించే రవీనా ఉసురికాయ(ఆమ్లా) మిశ్రమం: 
మొదట ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. కాగా బయట ఉన్న ఉసురి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు మర్దన చేశాక, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రపరచాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే త్వరలోనే షాంపో వాడకాన్ని తగ్గించవచ్చని రవీనా టండన్‌ తెలిపింది.
(చదవండి: వ‌చ్చే జ‌న్మ‌లో కూడా ఖాళీ లేదు)

మరిన్ని వార్తలు