ఆ రోజు నేను సెలబ్రేట్‌ చేసుకుంటా: రవిబాబు

17 Nov, 2020 21:06 IST|Sakshi

ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథా చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. మూస సినిమాలకు భిన్నంగా కొత్తదనం కోరుకునే దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు, మహమ్మారి కరోనా ‘పుట్టినరోజు’ సందర్భంగా ‘విషెస్‌’ చెబుతూనే, గట్టిగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ‘‘ మై డియర్‌ కరోనా.. ఇవాళ నీ బర్త్‌ యానివర్సరీ అని చాలా హ్యాపీగా ఫీలవుతున్నావు కదా. కానీ నేను మాత్రం భగభగ మండిపోతున్నా. త్వరలోనే వ్యాక్సిన్‌ వస్తుంది. అప్పుడు జనమంతా సంతోషపడతారు.(చదవండి: మహమ్మారి ‘పుట్టిన రోజు’ నేడే..!)

అంతా మామూలైపోతుంది. నువ్వు చచ్చిపోతావు. అప్పడు నీ డెత్‌ యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకుంటా’’ అంటూ రవిబాబు ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ‘క్రష్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతతి తెలిసిందే. కాగా మానవాళిని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ తొలి కేసు వెలుగులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తైంది. నిజానికి కోవిడ్‌-19 ఎప్పుడు పురుడు పోసుకుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ  హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వివరాల ప్రకారం 2019 నవంబర్‌ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల  వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు