ఆ నటుడు బెస్ట్‌ కిస్సర్‌..

26 Feb, 2021 12:45 IST|Sakshi

నియా శర్మ-రవి దూబే ఆన్‌స్క్రీన్‌ మీద బాగా ఫేమస్‌ అయిన జంట. వెండితెర మీద ముద్దులు, హగ్గులు ఇచ్చుకునే ఈ జంట జమాయి 2.0లో లిప్‌లాక్‌కు సైతం వెనుకాడలేదు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఈ జోడీ అండర్‌వాటర్‌లోనూ ముద్దులాడుతూ రెచ్చిపోయింది. ఇటీవల దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు హాజరైన నియాశర్మ తన కో స్టార్‌ రవి గురించి మాట్లాడుతూ అతడు బెస్ట్‌ కిస్సర్‌ అని బిరుదిచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా ఇది చూసి రవి దంపతులు షాకయ్యారు. కానీ ఆ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడకుండా స్పోర్టివ్‌గా తీసుకోవడాన్ని మెచ్చుకున్నారు.

ఈ మేరకు రవి మాట్లాడుతూ.. "నేను, నా భార్య సర్గమ్‌ ఇద్దరికీ నియా అంటే ఇష్టం. ఆమె నా గురించి మాట్లాడిన వీడియో చూసి బాగా నవ్వుకున్నాం. నన్ను బెస్ట్‌ కిస్సర్‌ అని పిలవడాన్ని ఓ ప్రశంసగా తీసుకుంటా. అంతే తప్ప దాన్ని నెగెటివ్‌గా ఏం తీసుకోము. ఏదేమైనా నియా నా బెస్ట్‌, ఫేవరెట్‌ కో స్టార్‌" అని చెప్పుకొచ్చాడు. అతడు నియా గురించి చెప్తూ రొమాంటిక్‌ సన్నివేశాలు నేచురల్‌గా రావడానికి ఆమె చాలా సహకరిస్తుంది. దీనివల్ల రెండో సీజన్‌లో క్లోజ్ సీన్లలో నటించడం చాలా ఈజీ అయింది. కాగా టీవీ సీరియల్‌ జమాయి రాజాకు సీక్వెల్‌గా వచ్చిందే జమాయి 2.0. ఈ వెబ్‌ సిరీస్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదిలా వుంటే ఉదారియన్‌ టీవీ షోతో నిర్మాతగా మారారు రవి దంపతులు.

చదవండి: విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్‌ మళ్లీ కలిపింది

వీడియోకాల్‌ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు