Ravi Teja: మేనేజర్‌ కూతుళ్ల హాఫ్‌ సారీ ఫంక్షన్‌లో రవితేజ సందడి

28 Feb, 2022 16:25 IST|Sakshi

Ravi Teja Attend His Manager Srinivas Raju Daughters Half Saree Function: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్​ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్​ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్​ జోష్​తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వ్యక్తులతో ఎంతో ఉదారంగా ఉంటాడు రవితేజ. వారికి సంబంధించిన వేడుకలకు హాజరవుతూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు. 

రవితేజ వద్ద శ్రీనివాస రాజు మేనేజర్​గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రాజుకు అనన్య, నిత్య ఇద్దరు కుమార్తెలు. వారికి హాఫ్​ సారీ ఫంక్షన్​ను ఆదివారం (ఫిబ్రవరి 27) రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్​ మహారాజా రవితేజ హాజరై సందడి చేశారు. అనంతరం అనన్య, నిత్యలను ఆశీర్వదించాడు. అలాగే ఈ కార్యక్రమానికి  దర్శకుడు అనిల్​ రావిపూడి, డేరింగ్ అండ్​ డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ తమ్ముడు సాయిరామ్​ శంకర్​, యంగ్​ హీరో తేజ సజ్జా, నటుడు బ్రహ్మాజీ ఫైట్​మాస్టర్స్​ రామ్​ లక్ష్మణ్​ తదితరులు హాజరయ్యారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు