రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన మాస్‌ మహారాజా, ఎంతంటే!

23 Jun, 2021 18:59 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ భారీగా రెమ్యూనరేషన్‌ పెంచినట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో సక్సెఫుల్‌ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కథలను ఎంచుకుంటూ తన మూవీల్లో కామెడీ ఎలిమెంట్‌ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మాస్‌ మాహారాజా. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఖిలాడీ’ మూవీలో నటిస్తున్న రవితేజ ఆ తర్వాత శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నాడు.

త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ఇదిలా ఉండగా రవి తేజ ఈ మూవీ నుంచి తన రెమ్యూనరేషన్‌ను పెంచినట్లు తెలుస్తోంది. క్రాక్‌ సినిమా వరకు 11 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ ఇప్పుడు ఏకంగా 17 కోట్ల రూపాయలకు రెమ్యునరేషన్‌ను పెంచాడట. శరత్‌ మాండవ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్‌ చిత్రానికి రూ. 17 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చదవండి:
వైరల్‌ ఫొటో: మాస్‌ మహారాజా కొడుకును చూశారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు