Dhamaka Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న ‘ధమాకా’.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎన్ని కోట్లు అంటే..

24 Dec, 2022 14:00 IST|Sakshi

మాస్‌ మహారాజా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ శుక్రవారం(డిసెంబర్‌ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలిరోజే మంచి టాక్‌ని సంపాదించుకుంది. రవితేజ ఎనర్జీ, యాక్షన్‌ ఎలిమెంట్స్‌.. శ్రీలీల గ్లామర్‌, డ్యాన్స్‌ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. రొటీన్‌ కథే అయినప్పటికీ..  రవితేజ నుంచి ఫాన్స్‌ ఏం ఆశిస్తారో అవన్నీ  ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాధ రావు నక్కిన.  అందుకే ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

(చదవండి: ధమాకా మూవీ రివ్యూ)

ఈ సినిమా మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది. నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్‌గా నిలిచింది. నైజాంలో రూ.2.10 కోట్లు, సీడెడ్‌లో రూ.72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.56 లక్షలు, ఈస్ట్‌ రూ.24 లక్షలు, వెస్ట్‌ 26 లక్షలు, గుంటూరు రూ.40 లక్షలు, కృష్ణాలో రూ.25 లక్షల చొప్పున వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెన్సింగ్‌ వచ్చాయి. క్రిస్మస్‌ సెలవులు ఉండడంతో ఈ వీకెండ్‌ కలెక్షన్లు భారీగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు