Dhamaka Trailer : రవితేజ 'ధమాకా' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌కు ముహూర్తం ఫిక్స్‌

11 Dec, 2022 14:15 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మాస్‌ పాటలు, టీజర్‌ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈనెల 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు