అమెజాన్‌ ప్రైమ్‌లో 'ఈగల్‌' సినిమా.. అఫీషియల్‌ ప్రకటన

27 Feb, 2024 07:28 IST|Sakshi

రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది.  బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈగల్‌ రవితేజ నటన పీక్స్‌లో ఉంటుంది. ఇప్పటివరకు చూడని రవితేజను ఈ చిత్రం ద్వారా ఆయన అభిమానులు చూశారు.

ఇప్పటికీ థియేటర్‌లో  ప్రేక్షకులను అలరిస్తున్న  ఈగల్‌ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. అయితే విడుదల తేదీని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. మార్చి 2వ తేదీన ఈగల్‌ ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. లేదంటే మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్‍ ఫిక్స్‌ అని చెప్పవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

ఈగల్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. సినిమాటోగ్రాఫర్‌గా పాపులర్ అయిన కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. వాస్తవంగా ఈ సినిమా ఏప్రిల్‌ నెలలో స్ట్రీమింగ్‌కు రావచ్చని అందరూ భావించారు కానీ ఎవరూ ఊహించని విధంగా మార్చిలోనే ఈగల్‌ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో రవితేజ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు