వినాయక చవితికి మాస్‌ మహారాజా ‘ఖిలాడీ’ ఫస్ట్‌ సింగిల్‌

6 Sep, 2021 17:31 IST|Sakshi

మాస్‌ మహారాజ్‌ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ‘ఖిలాడీ’ మూవీ. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌కు మంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో సరికొత్త అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీలో ఇష్టం అంటూ సాగే మొదటి పాట పూర్తి లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు దర్శకుడు రమేష్‌ వర్మ వెల్లడించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 10న ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో ‘ఇష్టం’ లీరికల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతోన్న నేపథ్యంలో రేపు(మంగళవారం) ప్రోమో రీలీజ్‌ చేస్తున్నట్లు ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు.

చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!

క్రాక్‌ మూవీ తర్వాత ‘రాక్షసుడు’ ఫేం రమేష్‌ వర్మ దర్మకత్వంలో మాస్‌ మహారాజ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో  వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం మూవీ విడుదలపై ఎలాంటి ఎటువంటి సమాచారం లేదు. అయితే త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఈ చిత్రంలో రవితేజకి జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి నటిస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనుండగా.. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు