రవితేజ 'ధమాకా' ట్రైలర్‌ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది

15 Dec, 2022 18:45 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. 

డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మాస్‌ పాటలు, టీజర్‌ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి.  ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్‌ సినిమాలా ఉంది. రవితేజ అభిమానులకు ఫుల్ మాస్ యాక్షన్‌ను చూపించబోతున్నారు.  ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందించారు. ట్రైలర్‌ రిలీజ్‌పై రవితేజ ట్వీట్ చేశారు. ఈనెల 23 థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు