ఆ హీరోయిన్‌తో రవితేజ లిప్‌లాక్‌!

20 Jan, 2021 11:48 IST|Sakshi

సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్స్‌ ఇప్పడు కామన్‌ అయిపోయాయి. అసలు ముద్దులేని సినిమాలు రావడమే గగనమైపోయింది. ఇక బాలీవుడ్‌ సినిమాల్లో అయితే కనీసం ఒక్కటైనా ముద్దు సీన్‌ ఉండాల్సిందే. అక్కడ కథ లేని సినిమాలు వస్తున్నాయేమో కానీ ముద్దు లేని సినిమాలు మాత్రం రావడంలేదు. ఇక ఈ లిప్‌లాక్‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా కామనైపోయింది. ముఖ్యంగా విజయ్‌దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లు ఎక్కువైపోయాయి.
(చదవండి : ముద్దు పెట్టలేదని రిజెక్ట్‌ చేసింది: అక్షయ్‌)

మహేష్ బాబు, పవన్ క‌ల్యాణ్‌ లాంటి స్టార్ హీరోలు కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా రామ్ పోతినేని కూడా ‘రెడ్‌’తో ఆ జోన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు మాస్‌ మహా రాజా రవితేజ కూడా ఇంగ్లీష్‌ ముద్దు పెట్టబోతున్నాడట. ‘క్రాక్‌’ సూపర్‌ హిట్‌ తర్వాత రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ఖిలాడి’లో రవితేజ ఒక లిప్‌లాక్‌ సీన్‌లో నటించారట. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరితో కలిసి ముద్దు సనివేశంలో నటించారట మన మాస్‌ మహారాజా. ఈ సీన్‌ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. వాస్తవానికి లిప్‌లాక్‌ సీన్‌ చేయడానికి రవితేజ మొదట్లో ఒప్పుకోలేదట. కానీ, డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ చాలా కష్టపడి రవితేజను ఒప్పించాడట. ఇష్టంలేకున్నా దర్శకుడి బలవంతం మేరకు లిక్‌లాక్‌ సీన్‌కు రవితేజ అంగీకరించాడట. మొత్తానికి మాస్‌ మహారాజా కూడా ఇంగ్లీష్‌ ముద్దు ఇచ్చి ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చేశాడన్నమాట. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు