Hero Ravi Teja: రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడు.. పోస్టర్‌ చూశారా?

9 Aug, 2022 13:12 IST|Sakshi

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్‌ ఆరంభంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అలరించిన రవితేజ ఆ తర్వాత హీరోగా సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇండస్ట్రీలోకి పరిచయం కానున్నారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్‌  భూపతిరాజు  'ఏయ్‌పిల్లా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ చిత్రానికి రమేశ్ వర్మ కథ అందిస్తుండగా,లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్‌ ఇండియా ఫస్ట్‌ రన్నరప్‌ రుబుల్‌ షెకావత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

A post shared by MB (@maadhav._.bhupathiraju)

మరిన్ని వార్తలు