Ravi Teja : 'రామారావు ఆన్ డ్యూటీ'.. పోస్టర్‌ రిలీజ్‌

12 Jul, 2021 12:13 IST|Sakshi

మాస్‌ మహారాజా రవితేజ జోరుమీదున్నాడు. ఈ ఏడాది క్రాక్‌ చిత్రంతో హిట్‌ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి అనే సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. ఇటీవలె మరో సినిమాకు సైన్‌ చేసిన రవితేజ ఇటీవలె షూటింగ్‌ను మొదలు పెట్టారు. రవితేజ కెరీర్‌లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఇందులో రవితేజ స్టైలిష్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో శరత్ మండవ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది.ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న మ‌జిలి ఫేమ్  దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు